ఓరుగల్లులో మహా కూటమి అలియన్స్ పాలిటిక్స్ ఫియర్

కెసిఆర్ కుటుంబ పాలన అంతమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడంలేదు అందులోనూ ముఖ్య నేతలకు టికెట్ల కేటాయింపు సమస్యగ మారింది , ఎవరి సిట్టింగ్ స్థలాలను వారికే కేటాయించాలని ఒత్తిడిలు సైతం పెరుగుతున్నాయి, ఇదే సమస్యతో కొండ సురేఖ మరోసారి వరంగల్ నుంచి పోటీ చేయక తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నట్లు తెలుస్తుంది , ఇదిలా ఉంటే నర్సంపేట నుంచి మరో సారి పోటీ చెయియనున్నటు రేవూరి ప్రకాశ్రెడ్డి చెబుతున్నారు , ఇది తనకు చివరి ఎలక్షన్ అని నియోజకవర్గం లో చేయాల్సిన అభివృద్ధి పూర్తిచేసి రిటైర్మెంట్ తీసుకుంటానాని అంటున్నారు , మరోవైపు సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి నర్సంపేట ను వదులుకునే పరిస్థితులలో లేరు, దీంతో ఇక్కడ ముసలం రాజుకుంటుంది, ఇక ఎవరు వెనక్కి తగ్గుతారని అని తెలియాల్సి ఉంది..

మరో వైపు కారుదిగి బేషరతుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కొండా దంపతులకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి, రెండు సీట్ల కోసం కొండా దంపతులు పట్టు పడినప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాలి అనుకున్నారు, పార్టీలోని మిత్రపక్షాలతో కొంత పట్టువిడుపు ధోరణి అవలంబించాల్సి రావడం, కొండా వరంగల్ ఈస్ట్ నుంచే పోటీకి సిద్ధం కావాలని హైకమాండ్ కూడా సూచించినట్టు ప్రచారం జరుగుతుంది , ఇదిలా ఉంటె కొండా సురేఖ పూర్తిగా పరకాలపైనే ద్రుష్టి సాధించారు , హైకమాండ్ సూచనతో కొండా దంపతులు తిరిగి వరంగల్ ఈస్ట్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు , పార్టీ ఎక్కడినుంచి పోటీ చేయమన్న చేస్తామన్న కొండా దంపతుల మాటే , వారు కోరుకున్న స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పుకోవచ్చు ,

ఇక వరంగల్ వెస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది తెలంగాణ జన సమితి పట్టుబడితే ఆ స్థానాన్ని కాంగ్రెస్ వదులుకునే పరిస్థితి లేకపోలేదు కాంగ్రెస్ లో ఆశావాహులు ఎక్కువ ఉండటంతో అలియన్స్ పార్టీలకు ఇవ్వటమే ఉత్తమమని లీకుల వస్తున్నాయి దీంతో టీజేఎస్ నిర్ణయం పైనే వరంగల్ వెస్ట్ భవితవ్యం ఆధారపడి ఉంది,

ఎక్కడ మొదలు పెట్టారు తిరిగి అక్కడికే వచ్చినట్లు అన్న చందంగా కొండా దంపతులు వద్దనుకున్న వరంగల్ ఈస్ట్ స్థానం నుంచి తిరిగి తిరిగి పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది, మొత్తానికి ఓరుగల్లులో మహా కూటమి కి అలియన్స్ పాలిటిక్స్ ఫియర్ పట్టుకుందని చెప్పాలి..