త్వరలో విడుదల కానున్న ‘అర్జున్‌ సురవరం’ సినిమా హీరో నిఖిల్‌ ఆదివారం సాయంత్రం వరంగల్‌ నగరంలో సందడి చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని ఏషియన్‌ శ్రీదేవి మాల్‌కు వచ్చారు. నిఖిల్‌ స్వయంగా సినిమా టికెట్లు విక్రయించారు. అనంతరం కన్నె కన్నె అనే వీడియో పాటను విడుదల చేశారు. విలేకరులతో మాట్లాడుతూ అర్జున్‌ సురవరం చిత్రాన్ని ఆదరించాలని కోరారు. నిఖిల్‌తో సెల్ఫీలు తీసుకొనేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఒకింత తోపులాట జరిగింది. నిఖిల్‌ ఎడమ కాలు చర్మంపై చిన్న గాయమైనట్లు తెలిసింది. చిత్ర దర్శకుడు టి.ఎన్‌.సంతోష్‌ తదితరులున్నారు.

Advertisement

వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళీ ఆలయాన్ని ఆదివారం సినీ హీరో నిఖిల్ సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా మండపంలో వేదపండితులు అమ్మవారి శేషవస్ర్తాలను బహుకరించి మహాదాశీర్వచనం చేసి ప్రసాదం అందించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకుడు దాస్యం అభినవ భాస్కర్ తదితరులు ఉన్నారు. అర్జున్ సురవరం సినిమాలో ఓ పాటను విడుదల చేశారు. ఏషియన్ శ్రీదేవి మాల్‌లో నిఖిల్ స్వయంగా సినిమా టికెట్లు విక్రయించారు.

గంగా హారతిలో పాల్గొన్న చీఫ్ విప్ దాస్యం
భద్రకాళీ చెరువుకట్టపై వేంచేసిన శ్రీ చంద్రమౌళీశ్వరస్వామికి ఆదివారం విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంకాలం తటాకంలో గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ పాల్గొన్నారు.