ఇటీవల దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అఖిల్ సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హైదరాబాద్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కలిశారు . ఈ సందర్భంగా అఖిల్ కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు . అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి కిలిమంజారో పర్వతశిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడని అభినందించారు . అఖిల్ ప్రతిభను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తా మని హామీ ఇచ్చారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని , ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ఆదుకుంటామన్నారు . KTR ను కలిసినవారిలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వికలాంగుల సహకార సంస్థ రాష్ట్ర చైర్మన్ వాసుదేవరెడ్డి , సామాజికవేత్త చిలువేరు శంకర్ , అఖిల్ తల్లిదండ్రులు కోమల రవీందర్ తదితరులు పాల్గొన్నారు .