ఓరుగల్లు ముద్దుబిడ్డ మన్నెం నాగేశ్వరరావుకు అరుదైన అవకాశం దక్కింది

CBI డైరెక్టర్‌గా విజయరామారావు పనిచేసిన తర్వాత మరో తెలుగు వ్యక్తిగా సీబీఐ బాస్‌గా నియమితులయ్యారు నాగేశ్వరరావు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలం బోర్ నరసాపురంకు చెందిన మన్నెం నాగేశ్వర్ రావును తాత్కాలిక సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల జాయింట్ డైరెక్టర్‌గా వ్యవరిస్తున్న నాగేశ్వరరావును డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీబీఐ డైరెక్టర్‌గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు తల్లిదండ్రులు శేషమ్మ -పిచ్చయ్య 1వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు యూపీఎస్‌ మంగపేటలో చదువుకున్న ఆయన. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు తిమ్మంపేట జెడ్పీ హైస్కూల్‌లో చదివారు, ఇక ఇంటర్ వరంగల్‌లోని ఏవీ జూనియర్ కాలేజీలో… డిగ్రీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ CKM కాలేజ్, దేశాయ్‌పేట్‌, వరంగల్.
ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశారు. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలోనే 1986లో సివిల్స్ రాసి IPS కి ఎంపికయ్యారు ఆయన 1986 ఒడిషా క్యాడర్‌ ఐపీఎస్‌గా ఎంపికైనా నాగేశ్వర్ రావు ఎక్కువకాలం ఛత్తీస్‌గఢ్‌లోనే పనిచేశారు.