కాకతీయుల ఆరాధ్య దైవం, ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తెప్పోత్సవంతో ముగియనున్నాయి. మంగళవారం భద్రకాళి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ద‌సరా ఉత్సవాల ముగింపు వేళ ఉద‌యం వరంగల్‌ భద్రకాళి అమ్మ వారు నిజరూపంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఉదయం 11 గంటలకు శరభ వాహన సేవ నిర్వహించారు.

Advertisement

సాయంత్రం 7 గంట‌ల నుంచి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. భద్రకాళి చెరువులో కన్నుల పండుగగా విద్యుత్‌ కాంతుల నడుమ హంసవాహనంపై అమ్మవారు విహరించారు. తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆ తర్వాత భద్రకాళి, భద్రేశ్వరుల కళ్యాణం అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.

ఈ ఆలయంలో జరిగే ప్రతీ ఉత్సవం దేనికదే ప్రత్యేకం కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం భద్రకాళీ అమ్మవారని భక్తులు నమ్ముతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్ తదితరులు తెప్పోత్సవంలో పాల్గొన్నారు…