ఖానాపురం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం (ఈనెల 5న) పురస్కరించుకొని శనివారం పాకాల అభయారణ్యంలో అటవీ శాఖ, హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్‌ సొసైటీ ఆధ్వర్యంలో బర్డ్‌వాక్‌ను డీఎఫ్‌వో పురుషోత్తం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. వనాల పెంపకం, కాలుష్య నియంత్రణ, వన్యప్రాణి సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమన్నారు. విద్యార్ధి దశ నుంచే పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు పడాలన్నారు. పాకాల అడవిలో ఇండియన్‌ పిట్ట గుర్తించినట్లు చెప్పారు. ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సైతం పక్షినడక కార్యక్రమం, 3న నర్సంపేట అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణపై ఉపన్యాస, పాటల పోటీలు, ఆన్‌లైన్‌లో నినాదాలు, చిత్రలేఖనం, కార్టున్‌ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీరాంరెడ్డి, గోపాలకృష్ణ, అటవీ అధికారులు పాల్గొన్నారు.