గుజరాత్‌లోని వడోదర పట్టణంలోని శివారులో వరదలమధ్యలో చిక్కుకున్న తల్లీకూతుళ్లను ఓ ఎస్సై రక్షించిన తీరు ప్రశంసలు అందుకుంటుంది. మొబైల్ సమాచారంతో వరద నీటిలో ఒకటిన్నర కిలోమీటరు పోయి , పురిటి బిడ్డను ప్లాస్టిక్ టబ్ లో పెట్టుకొని , తల్లిని బిడ్డను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాడు,
అనంతరం వరదల్లో చిక్కుకున్న మరికొంత మందిని కూడా కాపాడారు. ఈ క్రమంలో ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. ఇక ఈ విషయంపై స్పందించిన ఎస్సై
గోవింద ఇదంతా తన విధి నిర్వహణలో భాగమేనని పాపను రక్షించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.