ఓ డీఎస్పీ గారి చిన్నిల్లు కధ, భర్తకు ఉద్యోగం ఎర వేశాడు. భార్యను లైన్ లో పెట్టాడు.

తిరుపతిలో కాపువారం పెట్టించాడు. ఈ రోజు భర్తకు చిక్కిపోయాడు.

తన భార్యతో ఒక డీఎస్పీ వివాహేతర సంభంధం పెట్టుకున్నాడని గ్రహించిన భర్త భార్యను రెడ్ హ్యాండెడ్ పట్టుకుని పోలీసులు కు అప్పగించాడు . .డీఎస్పీ గారు పారిపోయినా కెమెరాకు మాత్రం చిక్కాడు. హైదరాబాద్లో ఉన్న సమయంలో డిఎస్పీ దుర్గ ప్రసాద్ తో ధనలక్ష్మి అనే మహిళా భర్తతో పరిచయం అయ్యింది. చిత్తూరు జిల్లా కలికిరి కి చెందిన ప్రసాద్ కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి..తెర వెనుక భాగోతం నడిపాడు డిఎస్పీ దుర్గ ప్రసాద్. ఈ క్రమంలో టిటిడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఉందని.. తిరుపతి కి వెళ్ళమని చెప్పాడు.

దీంతో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వివి నగర్లో వైష్ణవి అపార్ట్మెంట్ లో అద్దెకు దిగారు ధనలక్షి-ప్రసాద్ లు. అయితే, డిఎస్పీ తో చనువుగా ఉంటున్న భార్య ధనలక్ష్మి ని భర్త ప్రసాద్హె చ్చరించినా ఫలితం లేకపోయింది.డీఎస్పీ పై మోజులో భార్య ధనలక్ష్మి భర్త ప్రసాద్ ను దూరం పెట్టింది.అంతటితో ఆగకుండా .

తన ని వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడని పోలీసులు కు పిర్యాదు చేసింది. దీంతో సమయం కోసం ఎదురుచూసిన భర్త ప్రసాద్.. ఈరోజు వైష్ణవి అపార్ట్ మెంట్ లో డిఎస్పీ తన భార్యతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.మీడియా సమక్షంలో బయటకు వచ్చిన డిఎస్పీ కారులో పరారయ్యాడు. ధనలక్ష్మీ ని తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తిరుపతి అర్బన్ ఎస్పీ గుంటూరు బెటాలియన్ కు సమాచారం అందించారు.దుర్గ ప్రసాద్.. వెంకటగిరి 9వ బెటాలియన్ లో అసిస్టెంట్ కమాండ్ డెంట్ గా పని చేస్తున్నారు. . కేసు నమోదు చేసి విచారిస్తున్నారు..