{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":["add_photo_directory"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581192097148","total_editor_time":45,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581192097119","total_effects_time":0,"brushes_used":0,"height":672,"layers_used":0,"width":1242,"subsource":"done_button"}

ఖండాంతర ఖ్యాతి గడించిన శ్రీ మేడారం మహాజాతర భక్త జనసంద్రంగా మారింది. ఆదీవాసీల ఆరాధ్యదైవం సమ్మక్క గురువారం అశేష భక్తజనవాహిని నీరాజనల మధ్య వనం నుంచి జనంలోకి వైభవంగా తరలివచ్చి గద్దెలను అధిష్టించడంతో, మేడారం జాతర నిండుశోభను సంతరించుకుంది. వైబోపేతంగా అలంకరించిన గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజులు కొలువుదీరడంతో దేవతలను దర్శించుకోవటానికి దేశవ్యాప్తంగా భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు కూడా మేడారానికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఓ సాధారణ భక్తుడిలా మేడారానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భక్తులతో పాటు మామూలు క్యూ లైన్‌లో నిలబడి, గద్దెలను చేరుకోవటానికి గోడ దూకి మరీ ఆయన వనదేవతలను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ: ఆదీవాసీల ఇలవేల్పు దేవతల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు సార్లు మేడారం జాతర అట్టహాసంగా జరిగిందని గుర్తుచేశారు. రెండేళ్లకోసారి 4 రోజులపాటు జరిగే మహాజాతరకు దేశనలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని తెలిపారు. జాతర ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. అశేష భక్తజనవాహినితో విశేష ప్రాముఖ్యత కలిగిన మేడారం జాతరను జాతీయపండగగా గుర్తించాలని కడియం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.