{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578742280038","total_editor_time":6,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578742262675","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

హన్మకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం కుడా పరిదిలోని పెండింగ్ లో ఉన్న ఓసిటీ లో అభివృద్ది పనుల గురించి కమీషనర్ సత్పతి,కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మరియు అదికారులతో తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటివల ఓసీటిలో నివాసం ఉంటున్న వారు కుడా వాళ్ళనుండి అక్కడ స్థలాలు కొనుగోలు చేసారు వారు ఆ స్థలాలు కొనుగోలు చేసే సమయంలో కుడా వారు అభివృద్దిపై పలు హామీలను ఇచ్చారు ఐతే ఆ హామీల అమలులో జాప్యం జరుగుతుండటంతో వారి మొరను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు తెలిపారు స్పందించిన ఎమ్మెల్యే ఈ రోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో చర్చించారు..

కుడా వారు ఇచ్చిన హామీల ప్రకారం ఆర్చులు, రోడ్లు, సింథటిక్ ట్రాక్, కాంపౌండ్, పార్క్ అభివృద్ది తో పాటు పలు పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు..ఉగాది వరకు పనులు పూర్తి చేయాలని కమీషనర్, చైర్మన్ కు తెలిపారు. అతి త్వరలో పనులను పూర్తి చేస్తామని కమీషనర్ ఈ సందర్బంగా తెలిపారు, కుడా పరిదిలోని తూర్పు నియోజకవర్గంలో గల పెండింగ్ సమస్యలు ప్రత్యేక శ్రద్ద తీసుకుని పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ సందర్బంగా తొలిసారి కమిషనర్ సత్పతి గారిని కలిసిన సందర్బంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు నియోజకవర్గం పై కమీషనర్ గారు ప్రత్యేక శ్రద్ద ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ వస్కుల రాదిక బాబు,పీ.వో అజిత్ రెడ్డి,పలు విబాగాల అధికారులు,ఓసిటి ఓనర్స్ అసోసియేషన్ అద్యక్షుడు చంద్రశేఖర్,కుడా డైరెక్టర్ గులాం సర్వర్, తదితరులు పాల్గొన్నారు..