జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భరతం పట్టిన భారత వైమానిక దాడులు ప్రధాని నరేంద్ర మోదీ స్వయం పర్యవేక్షణలోనే సాగాయి. ఈ రోజు తెల్లవారుజామున మోదీ కంట్రోల్ రూంలో స్వయంగా కూర్చుని దాడులకు ఆదేశాలిస్తూ, పరిస్థితి గమనించారని అధికార వర్గాలు చెప్పాయి. జైషే ఉగ్రవాదుల స్థావరాలపై మన యుద్ధ విమానాలు బాంబు దాడులు చేస్తున్నప్పుడు ఆయన కంట్రోల్‌ రూమ్‌లోనే ఉన్నారు. అవి తమకు అప్పగించిన పనిని పూర్తి చేసుకుని తిరిగి మన భూభాగంలోకి సురక్షితంగా వచ్చేంతవరకు ప్రధాని అక్కడే ఉన్నారు. అవి వచ్చాక ఆయన కంట్రోల్‌ రూమ్ ‌నుంచి బయటికి వచ్చారు’ అని తెలిపాయి. జైషే మహమ్మద్ దురాగతాలు భారత భూభాగరక్షణకు సవాలుగా మారడంతోనే ఈ దాడులు జరిపామన్నాయి.

పండగ చేసుకోవాలి: మోదీ

Advertisement

ఈరోజు జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు జరగడంపై దేశమంతటా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్‌లోని చురులో జరిగిన సభలో వీటిని ప్రస్తావించారు. ఇది పండగ చేసుకోవాల్సిన సమయమని, దేశం ఇప్పుడు సురక్షిత హస్తాల్లో ఉందని అన్నారు. సైనిక సంక్షేమానికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.