బస్సు వేగంగా వెళుతున్న సమయంలో ఓ మహిళ కడుపులో వికారం వల్ల కిటికీలోంచి తల బయటికి పెట్టి కక్కడం స్టార్ట్ చేసింది . ఆ బస్సు వేగంగా రోడ్డు క్రిందకు దిగడంతో అక్కడే ఉన్నా కరెంటు పోల్‌కు ఆమె తల తాకి అక్కడికి అక్కడే మరణించింది.

శుక్రవారం మధ్యప్రదేశ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. సాత్నా జిల్లా చత్తాపూర్ ప్రాంతానికి చెందిన ఆశ రాణి అనే 56 ఏళ్ళ మహిళ సాత్నా జిల్లా నుంచి పన్నా జిల్లాకు బస్సులో ప్రయాణిస్తోంది. అదే సమయంలో డైమండ్ క్రాసింగ్ వద్దకు బస్సు చేరుకోగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుజుర్ స్పందిస్తూ. ‘మేం రాష్ డ్రైవింగ్ చేస్తున్నందుకు బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశాము. రాష్ డ్రైవింగ్ వలన ఆ మహిళకు కక్కు రావడం జరిగింది.” అని తెలిపారు. “మృత్యువు ఎప్పుడు ఏ రకంగా వస్తుందో ఎవ్వరం చెప్పలేం , మనం చేసే చిన్న చిన్న తప్పులవల్ల కూడా ప్రాణం మెడకు వస్తుంది”..