{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":["add_photo_directory"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578751315155","total_editor_time":159,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578751293002","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మరోక యువకుడితో చనువుగా వుంటున్న కారణంగా లష్కర్‌ సింగారం ప్రాంతానికి చెందిన మునిగాల హరతిని హత్య చేసిన నిందితుడు మహ్మద్‌ షాహిద్‌ ఆలియాస్‌ చోటును సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌ వివరాలను వెల్లడిస్తూ హరిత హత్యకు పాల్పడిన నేరస్థుడు మహ్మద్‌ షాహిద్‌ ఆలియాస్‌ చోటు వయస్సు 24, వరంగల్‌ జిల్లా, కాజీపేట్‌ విష్ణుపురి ప్రాంతానికి చెందినవాడు. నేరస్థుడి తండ్రి రజాక్‌, విష్ణుపురి ప్రాంతంలో మటన్‌ వ్యాపారం నిర్వహించేవాడు. నిందితుడు మహ్మద్‌ షాహిద్‌ 2016 హంటర్‌ రోడ్డులోని ప్రవైయిట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసాడు. నిందితుడు డిగ్రీ చదివే సమయంలోనే నిందితుడునికి ఇదే కళాశాలలో డిగ్రీ చదువుచున్న లష్కర్‌ సింగారం ప్రాంతానికి చెందిన మృతురాలు మునిగాల హరతితో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కోద్దిరోజుల అనంతరం మృతురాలు, నేరస్థుడి మధ్య స్నేహంగా మారడంతో పాటు, నేరస్థుడు మృతురాలితో చనువు పెరిగింది. ఇరువురి మధ్య ప్రేమ చిగురించడంతో కోద్దికాలం కల్సి తిరిగారు. నిందితుడు పలుమార్లు హరిత ఇంటికి రాకపోకలు కోనసాగించడం జరిగింది. నేరస్థుడు డిగ్రీ పూర్తి చేయడంతో గత ఆరునెలల క్రితం బ్యాంక్‌ ఉద్యోగాల కోచింగ్‌ తీసుకుంటునట్లుగా చెప్పి హన్మకోండలోని రాంనగర్‌ (క్రాంతినగర్‌) ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకోని గదికి అప్పుడప్పుడు వచ్చిపోతుండే వాడు. ఇదే గదికి మృతురాలు కుడా అప్పుడప్పుడు వస్తుండేది. కొద్ది రోజుల క్రితం మృతురాలు హరితకు శివనగర్‌ ప్రాంతానిని చెందిన సుకుమార్‌ అనే యువకుడితో పరిచయం అయింది. రెండు రోజుల క్రితం మృతురాలు సుకుమార్‌కు సెల్‌ఫోన్‌ ద్వారా మేస్సేజ్‌లు పంపడాన్ని గమనించిన నేరస్థుడు మృతురాలు హరతిని గట్టిగా అడగడంతో హారతి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నిందితుడు మరో యువకుడైన సుకుమార్‌ ఇంటి చిరునామా కనుగోని అతని ఇంటి వెళ్ళి అతనిని ప్రశ్నించాడు. తాను హరితను ప్రేమిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇదే విషయమైన నిందితుడు షాహిద్‌ మృతురాలు హరితను గట్టిగా ప్రశ్నించాడు.

హరిత సుకుమారును ప్రేమిస్తున్నట్లుగా తెలపడంతో ఆగ్రహనికి లోనైన నిందితుడు హరితను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. హరితను హత్య చేయాలనే రూపోందించుకున్న ప్రణాళికలతో భాగంగా నిందితుడు శుక్రవారం కలుసుకుందామని సెల్‌ఫోన్‌ ద్వారా సంక్షిప్త సమాచారాన్ని మృతురాలికి పంపాడు. హరిత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నయీంనగర్‌లోని మూడు చింతల ప్రాంతంలో నిందితుడు షాషిద్‌ను కలుసుకుంది. కోద్దిసేపు మాట్లాడుకుందామని నిందితుడు షాహిద్‌ మృతురాలు హరితను తన ద్వీచక్రవాహనంపై రాంనగర్‌ ప్రాంతంలో అద్దె గదికి తీసుక వెళ్ళాడు. నిందితుడికి, హారతికి మధ్య మాట, మాట పెరిగిపోవడంతో పాటు తనను మరిచిపోమ్మని, తాను సుకూమార్‌ను వివాహం చేసుకుంటానని మృతురాలు నిందితుడితో ప్రాధేయపడింది. దీనితో అప్పుడు నిందితుడు నటించి మృతురాలు హరతిను మోసపూరితంగా లొంగదీసుకున్నాడు. శారీరకంగా కలిసిన అనంతరం న హరతి తనకు దక్కదనే అక్కసుతో కక్షపూర్వకంగా నిందితుడు షాహిద్‌ తన దగ్గర వున్న కీచైన్‌ కత్తితో హరతిని గోంతుకోసి హత్యకు పాల్పడ్డాడు.

హత్య అనంతరం నిందితుడు గదికి తాళం వేసి రక్తపు మరకలతో విష్ణుపురిలోని తన ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకోని, హత్యకు ఉపయోగించిన కత్తిని ఇంటిలోనే వుంచి హరతిను హత్య చేసింది తానే అని పోలీసులు గుర్తిస్తారని నిందితుడు ఆటోలో లోంగిపోయేందుకు సెంట్రల్‌ జైలుకు వెళ్లాడు. అక్కడ వున్న వ్యక్తితో తాను చేసిన హత్య గురించి వివరించడంతో సదరు వ్యక్తి సుబేదారి పోలీసుల ఏదుట లోంగిపోవాల్సి వుంటుందని తెలపడంతో నిందితుడు ఆటోలో నిన్న సాయంత్రం సుబేదారి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోని ఇన్స్‌స్పెక్టర్‌ ముందు లోంగిపోయి చేసిన హత్యను అంగీకరించాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేసి నిందితుడి నుండి ఒక ద్వీచక్రవాహనం, రక్తం మరకలతో వున్న బట్టలు, కీచైన్‌ కత్తిని పోలీస్‌ స్వాధీనం చేసుకోని నిందితుడిని కోర్టు హజర్‌పర్చడం జరుగుతుంది.