కడియంకు ఏ పదవి ? ఇన్నాళ్లు డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరి రెండో కేబినేట్ లో మళ్లీ మంత్రి అవుతారని చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయని ఆయనకు కేసీఆర్ ఏ బాధ్యతలు ఇస్తారో చూడాలి .

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి మరోసారి కేబినెట్ హోదా దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది, నిన్నటి వరకు డిప్యూటీ సీఎంగా కొనసాగిన ఆయన రాబోయే రోజుల్లో ఏపదవిలో ఉంటారనే అంశంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది రాష్ట్రంలో రెండో ప్రభుత్వం ఏర్పాటైంది . ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు . మరో వారం పది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని TRS వర్గాలు అంటున్నాయి . మరో రెండు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి . ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే , ఎంపీ , ఎమ్మెల్సీ మంత్రి డిప్యూటీ సీఎం వంటి అన్ని రకాల పదవులను చేపట్టి తనదైన మార్క్ చూపించిన కడియం శ్రీహరి ఏదారి ఎంచుకుంటారు, కేసీఆర్ ఆయనకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికలుగుతుంది.

ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కడియం శ్రీహరి ఎక్కడి నుంచి పోటీ చేయలేదు . ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీలో నేతలు , కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారానికే పరిమితమయ్యారు . కష్ట-సాధ్యమనుకున్న స్టేషన్ ఘనపూర్ వంటి నియోజకవర్గంలో 35 ,000 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య విజయం సాధించడం వెనక కడియం కృషి ఉంది . మొత్తంగా ఇక్కడ పన్నెండు స్థానాల్లో పదింటా టీఆర్ఎస్ విజయం సాధించింది.

సామాజిక సమీకరణాలు పార్టీ వ్యవహారాల బేరీజు అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపడతారని సమాచారం . ఇటు ప్రజాప్రతినిధిగా , అటు రాజకీయంగా రాణిస్తున్న కడియంకు తప్పకుండా మంత్రి పదవి మరోసారి దక్కుతుందని ఆయన అనుచరులు నమ్మకంతో ఉన్నారు . ఈసారి కడియం సొంత నియోజకవర్గంలో ఊహించని రీతిలో చెలరేగిన అసమ్మతిని చల్లార్చడంలో శ్రమించిన తీరు పార్టీలో ఆయనకు మార్కులు తెచ్చిపెట్టింది . ప్రభుత్వ పాలనపరంగా సీఎం కేసీఆర్ ఆధారపడే నేతల్లో తుమ్మల , కడియం వంటి వారు ముందు వరుసలో ఉంటారు . అంతర్గత కుమ్ములాటల కారణంగా ఖమ్మంలో తుమ్మల అనూహ్యంగా ఓడిపోయారు . దీంతో పాలనపరంగా కేసీఆర్ కు ,కడియం అండగా ఉంటారనే భావన నెలకొంది రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కడియం సేవలను ఏ విధంగా ఉపయోగించుకోనుందనే అంశం మరి కొన్ని రోజుల్లో తేలనుంది .