యశోద ఆసుపత్రిలో దారుణం రోగి పరిస్థితి విషమం , హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు.. కడుపులో కణితి తొలగిస్తామని చెప్పి , తెలియకుండానే కిడ్నీని కూడా మాయం చేసిన మలకపేట యశోద ఆసుపత్రి నిర్వాకం వెలుగు చూసింది . ఈ మేరకు కుటుంబ సభ్యులు ఛాదర్ ఘాట్ పోలీసు స్టేషన్లో సదరు దాక్టర్లపై ఫిర్యాదు చేశారు . బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయు.

హయత్ నగర్ మండలం తారమతి పేట కు చెందిన శివ ప్రసాద్ (29) వారం క్రితం కడుపులో నొప్పి రావ‌డంతో య‌శోద‌లో చేరాడు. ప‌రీక్షించిన వైద్యులు క‌డుపులో గ‌డ్డ ఉన్న‌ట్లు గుర్తించి తొల‌గించ‌డానికి ఆరేష‌న్ చేయాల‌ని అందుకు రూ.8ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని తెలిపారు. శివ‌ప్ర‌సాద్ రూ.8ల‌క్ష‌లు చెల్లించ‌గా నిన్న ఆప‌రేష‌న్ చేసి గ‌డ్డ‌ను తొల‌గించారు. కాగా నేడు శివ ప్ర‌సాద్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ స‌భ్యులు వైద్యుల‌ను నిల‌దీయ‌గాౌ. గ‌డ్డ‌తో పాటు కిడ్నిని సైతం తొల‌గించిన‌ట్లు తెలిపారు.త‌మ‌కు చెప్ప‌కుండా కిడ్నిని ఎలా తొల‌గించార‌ని శివ‌కుమార్ కుటుంబ స‌భ్యులు య‌శోద ఆస్ప‌త్రి వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. జ‌రిగిన ఘ‌ట‌న పై చాద‌ర్ ఘాట్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు.