కరిచిన పామును ఆ రైతు ఏం చేశాడో తెలిస్తే.

పొలంలో గడ్డిని కోస్తున్న రైతును అత్యంత విషపూరితమైన పాము కాటేయగా, ఆ రైతు ఆ పామును ముక్కలుగా నరికి చంపాడు, చికిత్స కోసం వస్తూ మార్గమధ్యలో తానూ ప్రాణాలు విడిచిన సంఘటన మళవళ్ళి తాలుకాలో ఉన్న యత్తంబాడి గ్రామంలోని మహాదేవమ్మ తోటలో చోటు చేసుకుంది. పాము కాటుకు మృతి చెందిన రైతు దొడ్డచెన్నిపుర గ్రామానికి చెందిన మాదేగౌడ కుమారుడు పుట్టమాదు (35).

పుట్టమాదు వ్యవసాయంతో పాటు పట్టు పురుగులను పెంచుతున్నాడు. పట్టు పురుగులకు ఆహారం కోసం తమ ఊరు పక్కన ఉన్న తమ అక్క మహాదెవమ్మ తోటలో గడ్డి కోసుకొని రావడానికి వెళ్లాడు. రైతు గడ్డి కోస్తుండగా కాలిపై రక్తపింజర అనే విషపూరిత పాము కాటు వేసింది. పుట్టమాదు వెంటనే తన చేతిలో ఉన్న కత్తితో ఆ పామును ఆరు ముక్కలుగా నరికిచంపాడు. తన శరీరంలోకి విషం వెళ్ళకుండ కాలుపై భాగంలో దారంతో గట్టిగా కట్టాడు.

అతని అరుపులు విన్న పక్కచేనుల్లోని రైతులు అతన్ని అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది…