చైనాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విజృంభిస్తూ ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధికారికంగా పేరును పెట్టింది. కరోనాకు కోవిడ్‌-2019 (covid-2019)ను పేరుగా నిర్ణయించినట్లు వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అదానోమ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘కరోనాకు మేము కోవిడ్-19గా పేరును నిర్ణయించాం. కోవిడ్‌ పూర్తి పేరు c- corona, v- virus, d- disease2019. కరోనా అనే పేరు దానికి చెందిన కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుంది.

Advertisement

దీంతో ఈ పేరుపై గందరగోళాన్ని తొలగించేందుకు పరిశోధకులు ఈ అధికారిక పేరును పెట్టారు. ప్రజల్లో గందరగోళం కలిగించకుండా ఒకపేరు ఉండటం ముఖ్యం. అందుకే కొత్త పేరు నిర్ణయించాం. మేము కనుగొన్న పేరు ఒక భూభాగాన్ని గానీ, ఒక జంతువును గానీ, ఒక స్వతంత్ర జాతిని గానీ సూచించదు. ఈ పేరు ఆ వ్యాధిని తెలియజేస్తుంది’’ అని టెడ్రస్‌ వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా చైనాలో ఇప్పటివరకు సుమారు 1000 మంది మరణించినట్లు అక్కడి అధికారవర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.