ఇష్టం లేని పెళ్లిళ్లు నానా దారుణాలకు కారణమవుతున్నాయి. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు విధిలేక బలవంతపు పెళ్లిళ్లు తప్పించుకోడానికి పారిపోతున్నారు. ఈ అమ్మాయి కథ విభిన్నం. ఇష్టం లేని పెళ్లే చేసుకుంది. అయితే ఆ పెళ్లి చేసిన పూజారితో పారిపోయింది.
మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో మంగళవారం ఈ ఉపద్రవం జరిగింది. 21 ఏళ్ల యువతికి ఈ నెల 7వ తేదీన సిరోజ్ అనే యువకుడితో పెళ్లి జరిగింది. తర్వాత ఆమె ఏవో సాకులు చెప్పి పుట్టింటికి వచ్చేసింది.

23వ తేదీన రూ. 1.5 లక్షల ఖరీదైన నగలను, రూ. 30 వేల నగదు తీసుకుని కనిపించకుండా పోయింది. భార్య కనిపించడం లేదంటూ సిరోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆరా తీయగా, వారికి పెళ్లి చేసిన పురోహితుడు వినోద్ శర్మ కూడా అడ్రస్ లేకుండా పోయినట్లు తెలిసింది. రెండు మిస్సింగ్ కేసులపై పోలీసులు దర్యాప్తు జరిపారు. దర్యాప్తులో కళ్లు తిరిగే విషయాలు బయటపడ్డాయి. పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్న వినోద్ శర్మకు సదరు పెళ్లికూతురితో రెండేళ్లుగా సంబంధమున్నట్లు తేలింది. ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారట. ఇద్దరూ పెళ్లికి ముందే పారిపోవాలకున్నారని, అయితే పరిస్థితి అనుకూలించకపోవడంతో పెళ్లి జరిగేంతవరకు ఆగారని పోలీసులు చెప్పారు. ఇద్దరి కోసం గాలిస్తున్నారు.