కలియుగ మహా” పతివ్రత “.. ఈ కొత్త పెళ్లికూతురు..
పెళ్లి అయిన రెండురోజులకే తానొక వ్యక్తిని ప్రేమించానని భర్తకు చెప్పింది.. పాపం పిచ్చి భర్త .. సినిమా స్టైల్లో కరిగిపోయాడు.. పాతప్రియుడిని పిలిపించి పోలీసుల సమక్షంలో ఇద్దరికీ మళ్ళీ పెళ్ళిచేసాడు.. కొత్త భర్తతో ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళింది.. మూడు రోజులకు వాడూ లబోదిబోమంటూ పోలీసులవద్దకు వచ్చాడు.. అమ్మాయి వెళ్లిపోయిందని.. మొదటి మొగుడు ,రెండో మొగుడు ఇద్దరూ కలిసి వెతికారు.. చివరకు తేలింది ఏమిటంటే మరో యువకుడితో ఆమె మోటార్ బైక్ పై వెళ్లిపోయిందని..
మొత్తానికి వారంరోజుల్లో ఇద్దరు మొగుళ్లను మార్చి , ఏమార్చి మూడోవాడితో తుర్రుమంది..,కలికాలం పతివ్రత.. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు కొరాపుట్ పోలీసులు తెలిపారు.