{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582177249213","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582177105042","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

రాష్ట్రంలో IAS , ఇంజనీర్లు , ఎమ్మెల్యేల కంటే కూడా కరెంటోళ్లకే ఎక్కువ జీతాలున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు . అయినా వారు సరిగా పనిచేయడం లేదని విమర్శించారు . మెదక్ కలెక్టరేట్ లో పల్లె ప్రగతిలో భాగంగా బుధవారం విద్యుత్ అంశం చర్చకు వచ్చినప్పుడు మంత్రి మాట్లా డారు. విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనాథు పిలిచి జీతం ఎంతో చెప్పాలన్నారు.

దీనికి శ్రీనాథ్ సంశయించారు. జీతం ఎంతో చెప్పాలని కలెక్టర్ ధర్మారెడ్డిని అడగగా రూ.1.5 లక్షలని సమాధానమిచ్చారు. తన జీతం రూ. 3లక్షలని ఎస్ఈ శ్రీనాథ్ కూడా తర్వాత చెప్పారు. దాంతో మంత్రి హరీశ్ మాట్లాడుతూ: “ చూశారుగా ! ఎస్ఈకి అందుతున్న జీతంలో సగం మాత్రమే కలెక్టరుకు అందుతోంది . ఇంతంత జీతాలు అందుతున్నా విద్యుత్ శాఖ సిబ్బంది సరిగా పనిచేయడం లేదు ” అని మంత్రి వ్యాఖ్యానించారు .

రికార్డు స్థాయికి విద్యుత్తు డిమాండ్:

రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి అత్యధి కంగా మంగళవారం ఉదయం 7:47 గంటలకు 12 , 747 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా, బుధవారం ఉదయం 7:46 గంటలకు సమయంలో 12, 935 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. రబీ సాగుతోపాటు ఎత్తిపోతల పథకాలకు 1,200 మెగావాట్ల విద్యుత్తు వినియోగిస్తుండటంతో డిమాండ్ నిలకడగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు లోని అన్ని పంపుల నుంచి నీటిని ఎత్తిపోస్తున్న నేపథ్యంలో శుక్రవారం నాటికి డిమాండ్ 18వేల మెగావాట్లు దాటుతుందని భావిస్తున్నారు .