తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న గోవిందరావు పేట మండలంలోని లక్నవరం సరస్సు వెలవెలబోతోంది. నిండుగా నీరు, చుట్టూ పచ్చని ప్రకృతి, ఉయ్యాల వంతెనతో పర్యాటకుల మదిని దోచేస్తున్న ఈ టూరిస్టు స్పాట్‌ ప్రస్తుతం నీటిగుంతను తలపిస్తోంది. ద్వీపాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో సర స్సులోకి నీరు చేరలేదు. దీంతో 34 ఫీట్ల సామర్థ్యం కలిగి న సరస్సులో నీటిమట్టం 12 అడుగులకు పడిపోయింది. సరిగ్గా గతేడాది ఇదే రోజున సరస్సులో 30ఫీట్ల నీరు ఉంది. ఆగస్టు 12న మత్తడి దునికింది. ఇప్పుడు వర్షాలు లేక నీరు తక్కువగా ఉండటంతో బోటింగ్‌కు ఆటంకం ఏర్పడింది. బోటింగ్‌తోనే పర్యాటక శాఖకు మంచి రాబ డి ఉండగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఒడ్డుకు దూరంగా నీరు ఉండటంతో యంత్రాల ద్వారా కాల్వను తవ్వారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు నిరుత్సాహం చెందకుండా కొంతమేరకు బోటు షికారు చేయిస్తున్నారు. ఇదే క్రమంలో రెస్టారెంట్‌ కింద ఉన్న కాటేజీలను లేక్‌వ్యూ పాయింట్‌ ఏర్పాటు కోసం టూరి జం అధికారులు తొలగిస్తున్నారు. ఇదే దీవిలో కొత్తగా కాటేజీలు నిర్మిస్తుండగా పనులు చివరి దశలో ఉన్నాయి.