జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం రాత్రి జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణకు చెందిన ఓ సైనికుడు వీరమరణం పొందాడు. కొమరం భీమ్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్‌కు చెందిన దక్వా రాజేష్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ రోజు సాయంత్రానికల్లా అతని మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశముంది. రాజేశ్ ఈ నెల 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇంటికి వచ్చి, మళ్లీ కశ్మీర్ కు వెళ్లాడు. ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.