యశవంతపుర: ఏదో కష్టం వచ్చి ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించి మంచంపైకి రావాలని కోరిన ఎస్‌ఐని బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ ప్రతాప్‌రెడ్డి సస్పెండ్‌ చేశారు. కొడిగేహళ్లి పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి ఒక మహిళ వెళ్లారు. ఆమెతో ఎస్‌ఐ రాజణ్ణ అసభ్యంగా ప్రవర్తించి, తన గదికి రావాలని కోరారు. ఆమె మొబైల్‌ నంబర్‌ తీసుకుని అసభ్యకరమైన చాటింగ్‌ కూడా చేశాడు. ఎస్‌ఐ ప్రవర్తనతో ఆవేదనకు గురైన మహిళ సాక్ష్యాధారాలతో ఈశాన్య విభాగం డీసీపీ లక్ష్మీ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో అతని ఆగడాలు నిజమేనని తేలడంతో కమిషనర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు.