కసాయిసవతి కన్నీళ్లుపెట్టిన ఎస్పీ

సవతితోపాటు ఆమె సంతానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఓ మహిళ మానవత్వం మరిచి, దారుణంగా ప్రవర్తించింది. సవతి కూతురు(9)పై తన కొడుకు(14)తోపాటు అతని ఫ్రెండ్స్‌తో గ్యాంగ్‌రేప్‌ చేయించింది. ఆపై గొంతు నులిమి చంపి, కళ్లు పీకించి, యాసిడ్‌ పోయించింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగింది. యురికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఫహీదా , ఖుష్బూ . అతడు రెండో భార్య ఖుష్బూతోనే ఎక్కువ సమయం గడపడం, ఆమె కూతురంటే వల్లమాలిన ప్రేమ చూపడం మొదటి భార్యకు నచ్చలేదు. ద్వేషం పెంచుకున్న ఆ మహిళ ఆ చిన్నారిని చంపేందుకు పథకం పన్నింది.

ఆగస్టు 23వ తేదీన . సవతి కూతురును వెంటబెట్టుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లింది. వారిని ఆమె కుమారుడు, స్నేహితులు అనుసరించి వచ్చారు. అడవిలోకి వెళ్లాక ఆమె చెప్పిన ప్రకారం ఆమె చూస్తుండగానే.. కుమారుడు, అతని స్నేహితులు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ. బాలిక గొంతు నులిమి చంపింది. ఆమె కుమారుడు చిన్నారి తలపై గొడ్డలితో మోదాడు.

కొందరు బాలురు బాలిక కనుగుడ్లను చాకుతో పీకివేయడంతోపాటు బాలిక శరీరమంతటా యాసిడ్‌ చల్లారు. ఆపై మృతదేహాన్ని పొదల్లో దాచి, ఆకులు, కొమ్మలతో కప్పి వేసి ఇళ్లకు చేరుకున్నారు. తన కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం కనిపించినట్లు గ్రామస్తులు ఆదివారం సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

సవతి తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారుణం వెలుగులోకి వచ్చింది. మృతురాలి సవతి తల్లి, సవతి సోదరుడితోపాటు ఐదుగురిని అరెస్ట్‌చేశారు. ఈ సంఘటన వివరాలు చెపుతూ ఎస్పీ ఇంతియాజ్ హుస్సేన్ కన్నీటి పర్యంతమై ఎక్కిళ్ళు పెట్టిఏడ్చాడు…

ఛీ ఎక్కడికిపోతుంది ఈ సమాజం
ఒకసారి
ఒక్కసారి
ఒక్కసారైనా ప్రభుత్వం గట్టిగా స్పందించి
సరైన కఠిన చర్యలు చేపడితే ఇలాంటి ఘోరాలు కాస్తైనా తగ్గవచ్చు