ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా యస్.పి. కుమారి చందన దీప్తి గారు పదవ తరగతిలో పదికి పది సాదించిన కె.ప్రవల్లికను అభినందించారు. జిల్లా ప్రత్యేక బలగానికి చెందిన ARPC కె.మల్లేశం గారి కూతురైన ప్రవల్లిక పదవ తరగతి పరీక్షల్లో పదికి పది సాదించి జిల్లాకు మంచి పేరు తెచ్చారని, కె.ప్రవల్లిక ఇలాగే కస్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మల్లేశం గారు ప్రస్తుతం మాజీ మంత్రివర్యులు శ్రీమతి.సునీతా లక్ష్మారెడ్డి గారి వద్ద గన్మెన్ గా విదులు నిర్వహిస్తున్నారని,అన్నారు.తమ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండుటకు తల్లి తండ్రుల కృషి ఎంతో ఉంటుందని పిల్లలు కుడా తల్లి తండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలిపినారు.