కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా యాదాద్రి పుణ్య క్షేత్రం

కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా యాదాద్రి క్షేత్రం విశ్వవిఖ్యాతి పొందేలా యాదాద్రి క్షేత్రాన్ని రూపొందించే ప్రణాళికలో భాగంగా ఏనుగుల ప్రతిమలను పొందుపరిచే పనులు ప్రారంభమయ్యాయి. ఆలయనికి వచ్చే భక్తులు సేదతీరేలా పడమర దక్షిణ దిశలో పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర ప్రాంగణాలు, రక్షణ గోడకు 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తున ఏనుగులతో పాటు కాకతీయ కళాతోరణలు ఏర్పాటుకానున్నాయి. ఈ ఏర్పాట్లపై యాదగిరి అభివృద్ధి సంస్థ (యాడా) ప్రత్యేక దృష్టి పెట్టింది.