కాకతీయుల కళావైభవానికి , భక్తి పారవరానికి నిలయం వరంగల్ లోని వేయిస్తంభాల దేవాలయం. వేయిస్థంబాల పేరుతో నిర్మితమైన ఆలయ వైభవం నేటికీ కొనసాగుతుంది . ఈ దేవాలయంలో శివలింగాన్ని రుద్రేశ్వరస్వామిగా కొలుస్తారు . అంతే కాదు వేయిస్తంభాల దేవాలయానికి మరో విశిష్టత ఉంది . శివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు . వేలాదిగా భక్తులు స్వామి వారిని అభిషేకిస్తారు . దీంతో ఇక్కడ శివరాత్రి ఉత్సవ వేడుకల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి , భక్తి భావంతో పాటు ఆలయంలో కల ఉట్టిపడుతుంది , వేయిస్తంభాల దేవాలయాన్ని త్రికుటాలయంగా పిలుస్తారు ఇక్కడ శిను నితో పాటు విష్ణుమూర్తి , సూర్య భగవానుడు కొలుపుదీరాడు . 850 ఏళ్ల ఘనచరిత్ర కలిగి, దేశంలోనే ప్రముఖ పర్యటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందీ ఆలయం . రుద్రేశ్వరాలయంగానూ దీనికి పేరుంది.

క్రీ.శే . 1163లో కాకతీయుల రాజు రుద్రదేవుడి హయాంలో వేయిస్తంభాల ఆలయాన్ని నిర్మించారు . వేయిస్తంభాలతో ఆలయంతో పాటు ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపాన్ని అత్యంత సుందరనీగా తీర్చిదిద్దారు . కాకతీయు నిర్మాణం పూర్తి కావడానికి 80 సంవత్సరాలు పట్టినట్లు చరిత్ర చెబుతుంది కాకతీయులు శివభక్తులు కావడంతో వేయిస్తంభాల దేవాలయంలో భారీ ఆకారంలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్టించారు . శైవ క్షేత్రాల్లో సాధారణంగా శివునికి , శివలింగానికి ఎదురగా నందీశ్వరుడు ఉంటారు . కానీ వేయిస్తంభాల దేవాలయంలో భిన్నంగా సూర్యభగవానుడు కొలువై ంటారు . ఈ ఆలయం మరో విశిష్టతను కలిగిఉంది .

హరి హర వేదాలు రాకుండా ఆలయానికి త్రికూటాలయంగా నామకరణం చేసి శివునికి ఎడమై వైపున విష్ణుమూర్తిని , ఎదురుగా సూర్యభగవానున్ని ప్రతిష్టించారు, విష్ణుమూర్తి కి నిత్యకళ్యాణం పచ్చతోరణం అన్నట్లు నిత్యపూజలు జరుగుతాయి కాబట్టి విష్ణుమూర్తికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం విగ్రహం వెనకాల కళ్యాణమండపం నిర్మించారు రుద్రదేవ మహారాజు , ఇక్కడ శ్రీవునితోపాటు విష్ణు మూర్తి , సూర్యభగవానుడు నిత్య పూజలు అందుకోనేవారు . ఆలయంలోని శివలింగంపై ఉదయం గంటల 30 నిమిషాలు 6 గంటల మధ్యంలో సూర్యకిరణాలు నేరుగా పడతుంటాయి , అయితే కాకతీయ రాజుల్లో అగ్రగణ్యుడైన ప్రతాప రుద్రదేవ మహారాజును బందీగా పట్టుకోవడం కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ , మాలికఫర్ దండయాత్ర చేశారు . ఈ క్రమంలో జరిగిన యుద్ధంలో వేయిస్తంభాల దేవాలయం ద్వంసమైంది . కేంద్రపురవాస్తు శాఖ ఆధీనంలో ఉంది .