కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుడు

వెంకటేశ్వర స్వామికి కనకాభిషేకం చేసి, సమర్పించిన 18లక్షల బంగారు కాసులు ఎక్కడున్నాయో తేల్చాలని రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్య మరో దుమారం రేపుతోంది. ఒక్కో కాసు 100 గ్రాముల చొప్పున 18లక్షల బంగారు కాసులు పోటులోని నేలమాళిగలో భద్ర పరిచినట్టు ఇప్పటికీ శాసనాలున్నాయని చెప్పారు.

పోటులో నేలమాళిగపై ఉన్న రాళ్లను తొలగించడంతో ఇప్పుడా కాసులు వ్యవహారం అంతుపట్టకుండా ఉందని అన్నారు. ఈ బంగారు కాసులతో అభిషేకమే కాకుండా లెక్కలేనన్ని ఆభరణాలు, రత్నాంగి స్వర్ణ విగ్రహం ఇవన్నీ కూడా నేలమాళిగలోనే ఉంటాయని, వాటి సంగతి ప్రజలకు సమాధానం చెప్పకుండా ప్రత్యారోపణలు చేస్తూ సమస్యను దాటవేస్తున్నారని రమణదీక్షితులు ఆరోపించారు.