కాజీపేట చౌరస్తాను సిగ్నల్ ఫ్రీ మోడల్ గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తు సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు . ఈ సందర్భంగా అఖిలపక్షం అధ్యక్షుడు నార్లగిరి రామలింగం మాట్లాడుతూ , మోడల్ చౌరస్తాగా చేయాలని ఉత్తర్వులున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా కంటి తుడుపు చర్యగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు . వరంగల్ మహానగరానికి ప్రధాన స్వాగత తోరణం కాజీపేట చౌరస్తా , సర్వాంగ సుందరంగా ఉండేలా చేయకుండా, ఒత్తిళ్లతో రాజకీయ లబ్ది కోసం తూతూమంత్రంగా చేయడం సరికాదన్నారు . స్మార్ట్ సిటీ పేరుతో పనులు చేపడుతున్నా, అభివృద్ధికి నోచుకోకపోగా ప్రజలపై పన్నుల భారం తడిసి మోపెడవుతుందని అన్నారు . చారిత్రక నగరంలో ఒకటైన కాజీపేట పట్టణ అభివృద్ది విషయంలో రాజీపడేది లేదని , ఇప్పటికైనా అధికారులు , ప్రజాప్రతినిధులు శాశ్వత ప్రాతిపదికన మోడల్ గా తీర్చిదిదాలని ఆయన డిమాండ్ చేశారు . లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని అయన పేర్కొన్నారు …

కార్యక్రమంలో అఖిలపక్షం భాజపా నాయకులు అంకేశ్వరపు కుమార వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల ఉపేందర్ , ప్రధాన స్వామి , మహేంద్రన్ , మోడెం సదానందం , కార్యదర్శి పసునూరి మనోహర్ , వైకాపా నాయ స్వామినాథ్ ,కాయిత రాజ్ కుమార్ , సిరికొండ రామేశ్వరాచారి , తెదేపా నేత చిలువేరు మహేశ్ , తదితరులు పాల్గొన్నారు .