కాజిపేట రైల్వే పరిశ్రమ తరలింపుపై ప్రజా ప్రతినిధులు స్పందించాలని కాజిపేట అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు . కాజీపేట అఖిలపక్ష కమిటీ నాయకులు పరిశ్రమల స్థలాన్ని సందర్శించారు . ఈ సందరుంగా అఖిలపక్ష కమిటీ అధ్యక్షులు నార్లగిరి రామలింగం గారు మాట్లాడుతూ, సలం కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు పరిశ్రమలు వేరేచోట తరలిపోతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు . అభివృద్ది చేస్తామని ప్రజలు అధికారం ఇస్తే అభివృద్ది పడగల నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు . స్థానిక ప్రజా ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిశ్రమల వేరొక చోట తరలిపోకుండా చూడాలని తెలిపారు . ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ అధ్యక్షులు నార్లగిరి రామలింగం, వర్కింగ్ అధ్యక్షులు మేకల ఉపేందర్, పసునూరి మనోహర్ , ఇప్ప శ్రీకాంత్ , సాంబయ్య , అంక్లేశ్వర్ కుమారస్వామి , సదానందం , శోభారాణి సుధారాణి , వేణు , పాల్గొన్నారు