కాజిపేట సంక్రాతి సంబరాల్లో విదేశీ మహిళలు
వరంగల్ లో విదేశీ మహిళలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కాజీపేటలోని బాల వికాస స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ముగ్గులు వేసి ఆడి పాడి సందడి చేశారు. సామాజిక సేవా అనే సర్టిఫికెట్ కోర్సు కోసం వచ్చిన విదేశీ వనితలు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటి ముందు ముగ్గులతో భూమాతను అలంకరించే విధానం తమకు బాగా నచ్చిందని అన్నారు. మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా , ఇంటిని అందంగా అలంకరించే కొత్త విధానం తెలుసుకున్నామని తెలిపారు.

ముగ్గులతో భూమాతను అలంకరించే విధానం తమకు నచ్చిందని వీరు కెనడా, జాంబియా, నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన విద్యార్థులు తెలిపారు. ఇందులో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ శౌరిరెడ్డి, మేనేజర్ సునీత పాల్గొన్నారు.
