కాజీపేటకు రానున్న ద.మ. రైల్వే జీఎం.

ఈ నెల 15న కాజిపేటకు ద.మ.రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ విచ్చేయనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైందని రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు. బల్లారా నుంచి కాజీపేట వరకు జీఎం పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. జీఎం పర్యటన ఖరారు కావడంతో రైల్వే అధికారులు అవసరమైన అఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ఆయన రాక సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు సిద్దం చేస్తున్నారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం దశలవారీగా ప్రణాళికలు రూపొందించనున్నారు.

ఆయన ఈ సందర్భంగా పలు అంశాలను, కాజీపేట రైల్వేలో చేపట్టాల్సిన పనులపై సమీక్షించనున్నారు.