కట్టుకున్న భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం కాజీపేట పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. కాజీపేట ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. కడిపికొండకు చెందిన ఎనగందుల రజిత (34)కు పదేళ్ల క్రితం వివాహం కాగా రెండేళ్ల క్రితం మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. గత ఏడాది క్రితం మళ్లీ దర్గా కాజీపేటకు చెందిన వెల్పుల రాజును రెండోవివాహం చేసుకుంది. అప్పటికే రాజుకు అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండడతో వివాహం చేసుకున్న రజితను శారీరకంగా, మానసికంగా వేధించడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె విషం తాగింది. విషయం తెలుసుకున్న రజిత సోదరుడు ఎనగందుల రాజు, బంధువులు కలిసి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించాడు. కాగా ఎనగందుల రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.