ఏటీఎం కార్డును ఏమార్చి డబ్బులు అపహరించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాజీపేట ఎస్సై దేవేందర్ తెలిపారు. స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.అజయ్ తెలిపిన ప్రకారం కాజీపేటకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందిన ఏటీఎం కార్డును మూడు రోజుల క్రితం దొంగలించబడింది.
Advertisement
ఉప్పల్, రామగుండం, న్యూదిల్లీలో మొత్తం రూ.55 వేలు డ్రా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎస్సై దేవేందర్ సీసీ పుటేజీలను ఆధారంగా చేసుకొని నిధితులను పట్టుకొని వారి నుంచి రూ. 55 వేలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.