కాజీపేట రైల్వే స్టేషన్లో నలుగురు అనుమానితుల బైండోవర్

కాజీపేట రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్ననలుగురుని రైల్వే పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని రైల్వే పోలీస్ స్టేషనుకు తరలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం వీరిని కాజీపేట తహసీల్దార్ నాగేశ్వర్ రావు ఎదుట బైండోవర్ చేశారు. రాజేశ్, నరేశ్, హన్మంతు, దినకర్ అనే నలుగురు రైల్వే స్టేషన్లో తచ్చాడుతుండగా అదుపులోకి తీసుకుని బైండోవర్ చేసినట్లు రైల్వే ఎస్సై కె.జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. అనుమానితుల నుంచి వివరాలు, పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాత మిగతా వివరాలు వెల్లడిస్తామన్నారు. స్టేషన్ పరిసరాల్లో నిరంతరం నిఘా ఉంచుతున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

అనుమానాస్పదంగా కనిపించిన వారిని ప్రశ్నిస్తున్నామని, భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.