చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణంగా పెరిగిన కవలలైన ఇద్దరు యువతులు కవలలైన ఇద్దరు యువతులు చివరకు పెళ్లి కూడా తమను విడదీయకూడదని భావించారు. దీంతో ఆ ఇద్దరు కవలలు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు పెళ్లి పందిరిలో వరుడికి ఒకే పూలదండ వేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మాల్షిరాస్ తాలూకా అక్లుజ్ గ్రామానికి చెందిన పింకీ, రింకీ(36)అనే ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లు ముంబైలోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం వీరి తండ్రి చనిపోయాడు. పింకీ, రింకీ ఇద్దరూ చిన్నప్పటి నుంచి నివసిస్తున్న ఇంటిలో తల్లితో కలిసి ఉంటున్నారు. అయితే కొంతకాలం క్రితం పింకీ, రింకీ తో పాటు వారి తల్లి ఆరోగ్యం బాగోలేనప్పుడు తమ ఇంటికి సమీపంలో నివసించే అతుల్ అనే యువకుడు తన కారులో వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.

అప్పటి నుంచి ఆ యువకుడితో పింకీ, రింకీకి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ కవల సోదరీమణులు అతుల్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. దీంతో అతుల్‌ సొంత గ్రామమైన అక్లూజ్‌లో శుక్రవారం వారి పెళ్లి జరిగింది. పింకీ, రింకీకి అతుల్ తాళి కట్టాడు. ఈ సందర్భంగా ఇద్దరు వధువులు ఒకే పూల దండను వరుడి మెడలో వేశారు. పింకీ, రింకీ కలిసి వరుడి మెడలో పూలదండ వేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు పింకీని ఒకరు ఎత్తుకోవడంతో వరుడి మెడలో పూలదండ పడింది. కవల సోదరీమణులు ఒకే వ్యక్తిని పెళ్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “వీరి పెళ్లి చెల్లుతుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా” “జాక్ పాట్ కొట్టావ్ గురూ” అంటూ మరికొందరు మీమ్స్‌, ఎమోజీలతో మరి కొందరు ఫన్నీ కామెంట్ప్ పెడుతున్నారు.