ప్రభుత్వ రంగంలోనే కాదు ఎన్నో ప్రైవేట్ రంగాలలో కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. సెలవులు లేక , కనీస వేతనం అమలు కాకా దుర్భరమైన జీవితాలని అనుభవిస్తున్నారు… కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆదివారాలే కాకా ప్రభుత్వం ఇచ్చే సెలవుల్లో కూడా అధికారులు పని చేపించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం , భార్య బిడ్డలు వారి వ్యక్తిగత జీవితాలను కూడా వదులుకొని డ్యూటీ చేయాల్సిన పరిస్థతి … నెలకు 30 సమత్సరానికి 365రోజులు పని చేపియడం శోచనీయం…

వారికోసమే కొంత వెసులుబాటు :

కనీస వేతనం అమలుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని ప్రతిపాదనలు, సూచనలు చేసింది. అన్నిరంగాల్లో కనీస వేతనం అమలు చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ గుర్తింపుతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోనూ ఇది అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రతి సంస్థ కనీస వేతన కోడ్ అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏ సంస్థ అయినా సరే, కనీస వేతన కోడ్ అమలు చేయకుంటే 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. అలాగే ఉద్యోగులతో 8 గంటలకన్నా ఎక్కువగా పనిచేయించరాని చెప్పింది. ఎంత ఎమర్జెన్సీ పని ఉన్నా (8 గంటలకు) మించి పని చేయించుకోవద్దని సూచించింది.

అలాగే కనీస వేతనం అనేది ప్రతి ఐదేళ్లకోసారి సవరించాలని.కార్మికులకు కనీస వేతనం అమలు ప్రాథమిక హక్కు. కనీస వేతన కోడ్ అమలుకు సంబంధించి. కార్యాచరణ దాని తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.