(గీసుకొండ): ఇక నుంచి తాము కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా గీసుకొండ మండలంలోని వంచనగిరి, శాయంపేటహవేలీ, ఎలుకుర్తిహవేలీ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆదివారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కార్యకర్తలు అధైర్యపడొద్దని మేము మీకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కక్కెర్ల శ్రీనివాస్, ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు బీమగాని సౌజన్య, రజిత, గోపాల్, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు నల్గొండ రమేశ్, కొండేటి కొమురారెడ్డి, చాడ కొమురారెడ్డి, ఓనారెడ్డి పాల్గొన్నారు.
వరంగల్ నుంచి కొండా మురళి పేరు పరిశీలనలో ఉండగా.. మిగిలిన రెండు స్థానాలకు పలువురు సీనియర్ల పేర్లు పరిశీలనోలో ఉన్నాయి. ఈసీ నోటిఫికేషన్ వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తునే ముందు జాగ్రత్తగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.