కాలేజ్ బస్సు బీభత్సం , విద్యార్థిని మృతి

నగరంలోని కూకట్‌పల్లిలో చైతన్య కాలేజ్ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం డివైడర్‌తో దాటుతున్న ఇంటర్ విద్యార్థిని మీద నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే ప్రమాదం జరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ప్రమాదంతో కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

విద్యార్థినిని బలిగొన్న బస్సు అద్దాలను ధ్వంసం చేసిన తోటి విద్యార్థులు దాన్ని రోడ్డుమీదే నిలిపివేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.