కాష్టంపైనే వైద్య పరీక్ష

చితిపై వున్న శ‌వం ఊపిరి పీలుస్తొదంటూ బంధువులు గంద‌ర‌గోళం చేయ‌డంతో కొద్దిసేపు ఆందోళ‌నక‌ర ప‌రిస్తితి నెల‌కొంది. సాగ‌ర్ అనే ప‌ట్ట‌ణంలో చంపాలాల్ అనే వృద్ధుడు మ‌ర‌ణించాడు . స్మ‌శానాకి తీసుకెళ్ళి అంతిమ సంస్కారం చేస్తుండ‌గా శ‌వం నోటి నుంచి నుర‌గా వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో అంద‌రూ హ‌డావిడి ప‌డిపోయారు . వెంట‌నే ఇద్ద‌రు డాక్ట‌ర్లును స్మ‌శానాకి తీసుకొచ్చారు.

చితిపైనే ప‌రీక్షించిన డాక్ట‌ర్లు చంపాలాల్ కు ప్రాణం లేద‌ని అత‌డి నోటినుంచి నుర‌గా రావ‌డం స‌హ‌జంగా కొన్ని మృత‌దేహాల విష‌యంలో జ‌రుగుంద‌ని చెప్పివెళ్ళిపోయారు. త‌రువాత అంతిమ సంస్కారం పూర్తిచేశారు.