కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నవారిపై అమృత ఫిర్యాదు

తన భర్త ప్రణయ్ హత్య తర్వాత సోషల్ మీడియాలో కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అమృత కోరింది. ఈ మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిన్న సాయంత్రం ప్రణయ్ కుటుంబసభ్యులతో కలసి ఆమె సీఐని సంప్రదించింది.

తమను కించపరిచే విధంగా ప్రతి రోజు సోషల్ మీడియాలో పోస్టింగులు వస్తున్నాయని. అలాంటి అసత్య ప్రచారాలను ఆపాలని తాను ప్రాధేయపడినా, ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఐ నాగరాజు స్పందిస్తూ,

పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే, పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.