కాజీపేట , న్యూస్టుడే : నేపాల్లో జరిగిన కిక్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించి స్వదేశానికి తిరిగొచ్చిన చీకటి సుప్రియకు కాజీపేట రైల్వేస్టే షన్లో శుక్రవారం సాయంత్రం రజక సంఘం నేతలు ఘన స్వాగతం పలి కారు . హన్మకొండ రాగన్నదర్వాజ ప్రాంతానికి చెందిన సుప్రియ జనవరి 1 నుంచి 20 వరకు నేపాల్ లో జరిగిన కిక్ బాక్సింగ్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించి శుక్రవారం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో కాజీ పేటకు వచ్చారు . తెరాస నేత నార్లగిరి రమేష్ పాలడుగుల రామస్వామి , ఛాగంటి రమేష్ , పాలడుగుల శివకుమార్ , నాగెల్లి సమ్మయ్య , పాలడుగల కిషన్ సుధాకర్ , అనీల్ , జాకీ , రవి , తిరుపతి , తిరుమల రజక సంఘం నేతలు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు .