“ కిట్స్ ‘ లో ర్యాంప్ వాక్ .
కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఫ్యాషన్ షో అదిరింది . విద్యార్థులు పరేడ్ చేస్తుండగా సభాప్రాంగణం చప్పట్లతో మార్మోగింది . కిట్స్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ కార్నివాల్ “ సంస్కృతి – 19 ‘ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది . ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాత్రి విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్ షో ఆహుతులను ఆకట్టుకుంది . సినీ గాయకులు యాసిన్ నిజార్ , ఎర్రబత్తిని మనీషా , సాకేత్ , ఐశ్వర్యలో తమ మధురమైన పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించా రు . రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమైన కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది . కార్యక్రమం సందర్భంగా పలువురు విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించారు .

