విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు తన విధి ధర్మాన్ని మరచి ఓ విద్యార్థినిపై కీచక పర్వానికి తెర లేపాడు. అధ్యాపకుని చేష్టలను భరించలేక ఆ విద్యార్థిని కళాశాలకు రావడమే మానేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘నాకే గనక నీతోని గనక పెళ్లైతే గనక తర్వాత ఏమి చేయాలి ’ అంటూ విద్యార్థినికి టిక్‌టాక్‌ వీడియోను పంపించిన అధ్యాపకుడు, వాట్సా్‌పలోనూ అసభ్యకరంగా చాటింగ్‌ చేశాడు. కరీంనగర్‌ జిల్లాలోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసీఈ విభాగం హెడ్‌ సురేందర్‌ ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపించాడు. అతని వేధింపులను భరించలేక ఆ విద్యార్థిని కొద్ది రోజులుగా కళాశాలకు రావడమే మానేసిందని తెలిసింది. అధ్యాపకుని కీచక చేష్టల వీడియో కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా సోషల్‌ మీడియాలోని పలు గ్రూపుల్లో వైరల్‌ అయింది. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అన్నారు…