రాజధాని చెన్నైలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. టీ కొట్టులో పనిచేసే కార్మికుడు వీధి కుక్కపై అత్యాచారం చేశాడు. కుక్కపై అత్యాచారం చేసిన బాధితుడిపై చర్యలు తీసుకోవాలని జంతు సంరక్షణ సంస్థ ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం నందనం సమీపంలో వేకువజామున టీ కొట్టులో పనిచేసే కార్మికుడు బలవంతంగా కుక్కను పట్టుకొంటుండగా స్థానికుడు ఒకరు అడ్డుకున్నారు. కొంతసేపటి తర్వాత సదరు యువకుడు ఆ కుక్కపై అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు వారు అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.