జిల్లా పోలీస్ కార్యాలయంలో అట్లా బతుకమ్మ సంబరాలు

జిల్లా ఉన్నత అధికారి కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారి ఆద్వర్యంలో జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో అట్ల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా.. మెదక్ డి.పి.ఓ. ఏ.ఓ. కళ్యాణి గారు, డి.పి.ఓ. సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగినది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను ఆడపుడుచులు ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతుందని, తొమ్మిది రోజుల పాటు తిరోక్క పూలను పూజించడం జరుగుతుందని, ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను ప్రతి ఇంటా కుటుంబ సబ్యులతో ఆనందంతో సుఖ సంతోషంగా జరుపుకోవాలని ఈ సంధర్భంగా జిల్లా ఏ.ఓ. కళ్యాణి గారు అన్నారు.

ఆ తర్వాత హల్దివాగులో బతుకమ్మ నిమజ్జనం చేయడం జరిగినది. ఈ బతుకమ్మ సంబరాలలో డి.పి.ఓ. సిబ్బంది మణి గారు, ఆశ్లేష గారు, పద్మ గారు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.