కుమార్తెను బైక్‌పై కళాశాలకు తీసుకెళ్తుండగా వాహనం ఢీకోని
నారాయణగూడలోని శాంతి థియేటర్ వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో న్యాయవాది ప్రవీణ్ మృతి చెందాడు. తన కుమార్తెను బైక్‌పై కళాశాలకు తీసుకెళ్తుండగా వీరి వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో ప్రవీణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుమార్తె చేయికి తీవ్ర గాయమైంది.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కుమార్తెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.