కులం పేరుతో వేధింపులు ఒక వైద్య విద్యార్థిని ప్రాణం తీశాయి. ముగ్గురు మహిళా సీనియర్ల టార్చర్‌ తట్టుకోలేక వారం రోజుల క్రితం.. ముంబైలోని బివైఎల్‌ నాయర్‌ హాస్పిటల్‌లో గైనకాలజీ లో పిజి చదువుతున్న పాయల్‌ తాడ్వి ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌టి వర్గానికి చెందిన పాయల్‌ ను ముగ్గురు మహిళా సీనియర్‌ లు వేధింపులకు గురి చేశారు. ఆపరేషన్‌ థియేటర్‌లోకి రాకూడదని ఆంక్షలు విధిస్తూ.. ప్రసవం కేసులకు హాజరుకాకూడదని బెదిరించారు. వాట్సప్‌ గ్రూప్‌ లో కులం పేరుతో దూషిస్తూ.. పోస్టులు పెట్టారు. బాధిత కుటుంబానికి బాసటగా దళిత గిరిజన సంఘాలు నిలిచాయి. ముగ్గురు మహిళా సీనియర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పని ఒత్తిడిలో అలా అని ఉండవచ్చని తమకు ఎలాంటి ఉద్దేశం లేదని సీనియర్లు చెబుతున్నారు.