కూతురికి కన్యత్వ పరీక్షలు !! తల్లి పట్టుదల

కూతురికి కన్యత్వ పరీక్షలు !! తల్లి పట్టుదల !!

ససేమిరా అంటున్న కూతురు !! కోర్టులో వివాదం !!

కన్యత్వ పరీక్షలు నాగరిక సమాజానికి ఒక సవాల్. ఓ తల్లి తన కూతురుకు కన్యత్వ పరీక్షలు చేయించేందుకు సిద్ధం కాగా, ఇప్పుడీ అంశం న్యాయపరమైన పోరాటంగా మారింది. ఇరాన్ కి చెందిన ఓ కుటుంబం లండన్ లో కాపురం ఉంటోంది. మిత్ర ఇడియన్, అలీ సఫారీ దంపతులకు సోఫియా ఒకే ఒక కూతురు. సోఫియా కాలేజీలో బోవెల్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోందని, తాము ఇంట్లో లేనప్పుడు ఆ యువకుడిని ఇంటికి పిలిపించుకుంటుందనే అనుమానంతో తల్లిదండ్రులు ఆమెను కన్యత్వ పరీక్షకు సిద్ధం కమ్మన్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అయితే, సోఫియా కన్యత్వ పరీక్షకి డాక్టర్ దగ్గర అంగీకారం తెలపలేదు. తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలని తల్లిదండ్రులే కోరడం తనకు అవమానంగా ఉందని,

అందువల్ల తాను ఇందుకు అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. దీంతో డాక్టర్ కన్యత్వ పరీక్షలు ఆమె అంగీకారం లేకుండా చేయడం చట్టవిరుద్ధమని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే తల్లిదండ్రులు గట్టిగా పట్టుబట్టడంతో డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ఇప్పుడు దక్షిణ లండన్ కోర్ట్ లో జరుగుతోంది. కన్యత్వ పరీక్షలకు అంగీకరించకపోతే కూతుర్ని వదులుకుంటామని తల్లిదండ్రులు చెబుతున్నారు. దానికి సమ్మతమేనని కూతురు చెబుతోంది. మరోవైపు ఇరాన్ నుంచి మరో బంధువుని పిలిపించి సోఫియాకు పెళ్లి చేయాలని అందుకోసమే తమ సాంప్రదాయం ప్రకారం అనుమానం వచ్చినప్పుడు ఆమె కన్యత్వాన్ని పరీక్షకు పెట్టామని, ఇందులో తప్పులేదని ఇది తమ సాంప్రదాయమని తల్లిదండ్రులు చెప్పారు.

ఈ గొడవల మధ్య ఇప్పుడు కేసు ట్రైల్ కి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here