కృష్ణా ఎక్సప్రెస్ నుండి ప్రమాదవశాత్తు రైలుబండి నుంచి జారి, రైలుకింద పడి మృతి

ఆదిలాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్సప్రెస్ నుండి ప్రమాదవశాత్తు రైలుబండి నుంచి జారి, రైలుకింద పడి మృతి చెందిన విషాద సంఘటన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది . డోర్నకల్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామానికి చెందిన పంత శ్రీరాములు ( 42 ) కృష్ణాఎక్స్ ప్రెస్సలో ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి రైలుకింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు కులవృత్తి వడ్రంగి పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని తెలిపారు . పనిమీద రాజమండ్రి నుండి గజ్వెల్ లోని తన అన్నయ్య ఇంటివద్దకు వెళ్ళి తిరిగి రాజమండ్రి వెళ్ళేందుకు తిరుగు ప్రయాణంలో బోనగిరి రైల్వేస్టేషన్లో కృష్ణ ఎక్స్ ప్రెస్ ఎక్కి ప్రయాణిస్తుండగా గార్ల రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు జారి రైలుకింద పడటంతో శరీరం రెండుముక్కలై అక్కడిక్కడే మృతి చెందాడని తెలిపారు . మృతుడికి భార్య , ఇద్దరు కుమారులు ఉన్నారు . కేసు నమోదు చేసి పోస్టిమార్టం నిమిత్తం మానుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు …